చికెన్ షోర్బా తయారీ విధానం:
మసాలా పేస్ట్: మిక్సీ జార్‌లో గుప్పెడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి (కారం సరిపడా), 1 స్పూన్ మిరియాలు, ¼ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
పోపు: కుక్కర్ లేదా గిన్నెలో కొంచెం బటర్ లేదా 2 స్పూన్ల ఆయిల్ వేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించాలి.
చికెన్ వేయించడం: క్లీన్ చేసిన 150గ్రా చికెన్, ఉప్పు, పసుపు వేసి 5 నిమిషాలు నూనెలో మగ్గనివ్వాలి. తర్వాత సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేసి మరో 5 నిమిషాలు వేయించాలి.
ఉడికించడం: తగినన్ని నీళ్లు, కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టి (విజిల్ లేకుండా) 15 నిమిషాల పాటు చికెన్ మెత్తబడే వరకు ఉడికించాలి.
సర్వింగ్: చివరగా ఉప్పు సరిచూసుకుని, కొత్తిమీర చల్లి, నిమ్మరసం పిండుకుంటే ఘాటుగా, కమ్మగా ఉండే చికెన్ షోర్బా రెడీ.
వెల్లుల్లి కారం ఫ్రైడ్ రైస్:
కారం తయారీ: 6 పెద్ద వెల్లుల్లి రెబ్బలు, 1½ స్పూన్ కారం వేసి రోటిలో కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి.
పోపు: పాన్లో నూనె వేసి, ఎక్కువ మొత్తంలో పోపు గింజలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
రైస్ కలపడం: వేగిన ఉల్లిపాయల్లో దంచుకున్న వెల్లుల్లి కారం, సరిపడా ఉప్పు వేసి 2 నిమిషాలు వేయించాలి. తర్వాత పొడిపొడిగా వండిన ఇద్దరికి సరిపడా అన్నం వేసి బాగా కలిపితే ఘాటైన గార్లిక్ రైస్ రెడీ.
సైడ్ డిష్ (ఎగ్):
అదే పాన్లో కొంచెం నూనె వేసి, ఉప్పు, కారం చల్లి రెండు గుడ్లను విడివిడిగా పగులగొట్టి వేయాలి. రెండు వైపులా బాగా కాల్చుకుని ఈ రైస్‌తో తింటే అద్భుతంగా ఉంటుంది.
12 Comments
Gud night sista ❤😊
Recipies share cheyandi sister
Kncm slow motion loo edit cheyyandi sister,miru oka recipe Ela chestunaroo choodam anelopu inko place loo untundhi camera , voice kii video kii sambandham lekunda untunaii, voice over aina slow gaa cheppandi leka video aina slow gaa edit chesi pettandi plzzzzz
Receipes please
Hai beautiful family andharu bhagunnara super me home tour cheyyandi sister 👍👌🙏
Akko home tour 😂
Meeru super Abba
Hai super
Sonyi coffee short plsss
Hi aniy chusthuna kani anitiki msg cheyatledhu naku baga nacchinapudu chesthu vuntanu me video asalu miss kakunda chusthu vunta nu
Sink lo.soap organizer ekkada theesukunnaru andi link share cheyara
Me egg orgizer link evvandi